ఈ పుట ఆమోదించబడ్డది
345
నెమలిఅడుగు చెట్టు కొండలమీద పెద్దదిగా పెరుగును. ఆకులు మిశ్రమ పత్రములు. పువ్వులు చిన్నవి. దీని కలప కొంచెమెర్రగా నుండును. ఇది పెట్టెలు బీరువాలు చేయుటకు పనికి వచ్చును.
- బ్రాహ్మిణిచెట్టు గుబురుగా పెరుగు చిన్న మొక్క. ఆకులొక్కొకచోట మూడో నాలుగో యుండును. పువ్వులు మొదట తెల్లగా నుండును. కాని క్రమముగా ఎర్రబారును.
- తులసి మొక్క మన దేశము నందంతటను పెరుగు చున్నది.
- ప్రకాండము
- - నాలుగు పలకలుగా నున్నది. దీని మీద రోమములు గలవు.
- ఆకులు
- - లఘు పత్రములు. అభిముఖ చేరిక. తొడిమ గలదు. కణుపు పుచ్ఛములు లేవు. పత్రము అండాకారము. విషమ రేఖ పత్రము. అంచున రంపపు పండ్లు గలవు. కొన సన్నము. దీని మీదస్ను రోమములు గలవు. దీని కొక విధమగు వాసన గలదు.
- పుష్ప మంజరి
- - కొమ్మల చివర ప్రతికణుపునందును మధ్యారంభ మంజరులుగ నున్నవి. వీనికి చేటికలు గలవు. పువ్వులు చిన్నవి. అసరాళము. సంపూర్ణము ఓష్టారకారము
- పుష్ప కోశము
- - సంయుక్తము. 5 దంతములు గలవు. నీచము స్థిరము కాయతో గూడ బెరుగును. కాయ కంటె నిది పెద్దది.