ఈ పుట ఆమోదించబడ్డది

342

గ నెకరమునకు 50 చెట్లుండును. అదిమంచినేల యైనా 300 అడుగుల కలప వచ్చును. కలపలో టేకుకలపయో మిక్కిలి శ్రేష్టమైనది. ఇది నీటిలో చిరకాలము చీకి పోకుండ యుండును. మరియు పడవలు చేసినపుడు దీని మీదనుండెడు మేకులకు కూడ త్రుప్పు పట్ట నీయదు. కలపను దొలిచెడు పురుగులు కూడ దీనినంతగా దొలువ లేవు. ఈ కలప అన్ని చెక్కడపు పనులకు, బీరువాలకు, బల్లలకు, మేడ మెట్లు గట్టుటకు రైలు బండ్లకు, ఓడలకు, అన్నిటికి పనికి వచ్చును.

ఈ కలపను కాగులో వేసి కాల్చిన యెడల తారు వచ్చును. దీని నుండి చమురు తీసి దానిని ఔషదములలో వాడు చున్నారు.

దీని అకుల దిని నొకవిధమగు పట్టు పురుగు బ్రతుక గలదు.

టేకు వ్యాపారము మన దేశమున కంటే బర్మా దేశమున ఎక్కువ గలదు. టేకు కలప మన దేశమునుండి యొక్కువగా ఇంగ్లాండునకే పోవు చున్నది.

మడ చెట్లు కొన్ని చోట్ల పెద్ద చెటేటుగా కూడ పెరుగుచున్నవి. పెద్ద చెట్ల కలప గానుగలు మొదలగునవి చేయుటలో నచ్చటచ్చట వాడు చున్నారు గాని అది పెళుసుగా నుండుటచే వంట చెరుకుగానె విశేషముగా ఉపయోగించు చున్నారు. దీని బెరడుతో తోలు బాగు చేయ వచ్చును. దీని కాయలు వెన్నతో ఉడకపెట్టి పట్టించినచో కొన్ని పుండ్లు పోవును.