ఈ పుట ఆమోదించబడ్డది
331
- అడ్డసరము పువ్వు.
ఆకులు:- అభి ముఖ చేరిక లఘుపత్రము కణుపు పుచ్చములు లేవు. కురుచ తొడిమ వెడల్పు బల్లెపాకారముగ నుండును. సమాంచలము, విషమ రేఖ పత్రము, ఇరుపక్కల నున్నగా నుండును. కొన సన్నము.
- పుష్ప మంజరి
- - కంకి కణుపుసందుల నుండి పెరుగు వృంతముల మీద పుష్పములు దట్టముగా నుండును. ఉప వృంతము సందులనుండి పెరుగు వృంతముల మీద పుష్పములు దట్టముగా నుండును. ఉప వృంతములు లేవు. చేటికలు గలవు. 2 చేటికలు 9 ఉప చేటికలును గలసి పుష్పమును మరుగు పరుచును.
- పుష్పకోశము
- - సంయుక్తము తమ్మెలు 5. నీచము ఆకు పచ్చని రంగు
- దళవలయము
- - సంయుక్తము రింది భాగము గొట్టము వలెను పైభాగము ఓష్టాకారముగను నుండును. పై పెదవి యందు తమ్మెలు రెండును క్రింది పెదవి యందు మూడును గలవు. తెలుపు రంగు క్రింది పెదవి మీద నెర్రని చారలు గలవు. మొగ్గలో ఈ తమమెలు అల్లుకొని యుండును.
కింజల్కములు:-రెండుదళవలోఅయము నంతటుకొని యుండును పైపెదవికిదగ్గరగానుండును. పుప్పొడిక్రిందివైపునకోణమువలెనుండును. పుప్పొడితిత్తులు రెండుగదులు సమముగావుండక ఒకటి మీదికిని రెండవది కొంచము క్రిందకును నున్నవి.