ఈ పుట ఆమోదించబడ్డది

319

గువచ్చి పశుపు పచ్చని మచ్చలు పడ బోవు చుండగా కోసి వేసెదరు. వెంటనే వానిని నీలమీద బరచి చొంచమునే వుంచి గ్దులలో ఆర బెట్టుదురు. త్వరగా కొలది దినములలోనె ఎండినచో ఆకులు పసపు పచ్చగనో ఆకు పచ్చగనో నుండును. లేని యెడల నల్లగనగును. లంక లలోని వారీయాకును గోయగనే పాతర వేయుదురు. ఎండిన ఆ ఆకులను కొన్ని దినములు పోయిన తరువాత కొబ్బరి నీళ్ళ మొదలగు వానితో బదును పట్టుదురు.

చుట్టలు కాల్చు వారలును, పొడువుము పీల్చు వారలును పొగాకు నములు వారలును చాల మంది కలరు కాని, మొత్తము మీద అది తెచ్చి పెట్టుకొనిన క్రొత్త అలవాటనియు అంత ఆరోగ్యం కాదనియు అందురు.

సుమారు నూరేండ్ల నుండియు మనమును పొగాకును వర్తకము చేయు చున్నాము. 1825 సంవత్సరములో మొట్టమొదట బందరు నుండి పొడుము ఎగుమతి అయ్యెను. చుట్టలు సిగరెట్లు కాల్చుట కలవడిన వారలకును, అవి ప్రియమగునున్నవని మాను వారలకును వీలుగ నుండు నట్లు అన్య దేశముల వారు అ యీరకముల పొగాకుతో చౌకగ సిగరెట్లను చేసి మనకు పంపు చున్నారు. ప్రతి సంవత్సస్రమును మనము