318
పొగాకు విత్తులు చల్లుటకు మళ్ళు, చెరువులు గుంటల దగ్గర చేయుదురు. విత్తనములు చల్లుటకు పూర్వము ఎకరమునకు ఏబది అరువది బళ్ళ పేడ వేసి దున్నుదురు. చల్లిన కొన్ని దినముల వరకు దినమునకు మూడు నాలుగు సారులు నీళ్ళు పోయుదురు గాని తరువాత తగ్గించుదురు. ఎనిమిది తొమ్మిది అంగుళములు ఎదిగిన పిదప నీరసముగ నున్న మొక్కలను లాగి వేసి, కొమ్మలేమైన పుట్టుచుండిన యెడల వానిని త్రుంచి వేసి, పొలములో పాతుటకు మొక్కలను దీసి కట్టలు గట్టుదురు. పొలములో మంద గట్టి చెరువు బెడ్డ వేసి బలపరుచ వలయును. పొలములో మళ్ళు గట్టి మొక్కలను పాతుదురు. పాదిన మూడు నాలుగు దినముల వరకు రెండేసి సార్లు నీరు పోయుచుందురు గాని తేరువాత మానెదరు. దోదావరి కృష్ణా మొదలగు నదులలోని వండ్రు మట్టి గల లంక ప్రదేశములు యివి పైరు చేయుటకు చాల మంచివి. మొక్కలు రెండున్నర అడుగులు ఎదిగిన పిదప వాని చివరలను త్రుంపి వేయుదురు. పొడుము కొరకై పొగాకును బండించు చున్న యెడల నూతి నీరెప్పుడు వాడరు. వర్షాధారముననే బండించెదరు.
నములుటకైనచో ఆకు గోయుటకు నాలుగైదు దినముల మ్ందటినుండి నీరు దగుల నీయరు. ఆకులకు ముదురు రం