315
మెరప మొక్క గుల్మము, ఆకులు లఘుపత్రములు బల్లెపాకారము పువ్వులు ఛాత్రాకారము, తెలుపు. అండాశయములో రెండు గదులు కొన వరకు లేవు. ఈ మొక్క అన్య దేశముల నుండి తేబడినది గాని అనాదినుండియు మన దేశమున మొలచినది గాదు పోర్చు గీసు వారు మొదట మన దేశమునకు వచ్చునపుడు దీసికొని వచ్చిరి. శీఘ్ర కాలములోనే మెరప కాయల వాడుకయు వ్వాపించెను. మెరప కాయల లో ముఖ్యమైనవి రెండు రకములు గలవు. ఒకటి ఎఱ్ఱగానుండును. రెండవది పచ్చాగా నుండును. వీని లోను బొడుగు పొట్టి భేదములు గలవు. ఎర్రవానికంటె పచ్చనివియు, పొడుగువాని కంటే పొట్టివియు కార మెక్కువ. మెరప గింజలను కొన్ని చోట్ల చేల గట్ల మీద జల్లెదరు, కాని ప్రత్యేఇకముగ వానినే బండించు నపుడు ఎరువు వేసి పొలము కలియ దున్ని విత్తనములు చల్లుదురు. కొన్ని చోట్ల గింజలను మళ్ళలో జల్లి లేత మొక్కలను చేలలో పాతు చున్నారు. వీనికి నీరు ఎక్కువగా అక్కర లేదు. మెరప కాయలు హిందూ దేశములో ఎల్ల చెన్న రాజ్యములో ఎక్కువ పండు చున్నవి.
పువ్వులు ఛాత్రాకారము. తెలుపు. అండాశయములో రెండు గదులు కొన వరకు లేవు.