ఈ పుట ఆమోదించబడ్డది
308
చిలగడదుంప కుటుంబము.
చిలగడ దుంప తీగె నేల మీదనే ప్రాకుచుండును. వేళ్ళు ఊరి పెద్దావగును.
- ఆకులు
- - ఒంటరి చేరిక హృదయాకారము. లఘు పత్రములు సమాంచలము కొన సన్నము. విష రేఖ పత్రములు. తొడిమలు పొడుగుగా వుండును.
- పుష్ప మంజరి
- - కణుపు సందులందుండి మధ్యారంభ మంజరులుగను వున్నవి. పువ్వులు పెద్దవి. సరాళను.
- పుష్ప కోశము
- - అసంయుక్తము. గరుకు పత్రములు ఐదు. సమగోపనారము. నీచము.
- దళ వలయము
- - సంయుక్తము. గరాట వలె నుండును. 5 ఆకర్షణ పత్రము కలిసి యున్నవి. మొగ్గలో మెలివెట్టి నట్లుండును.
- కింజల్కములు
- - అయిదు దళ వలయము నంటి వుండును. అన్నియు సమముగా లేవు. కొన్ని పొట్టి కొన్ని పొడుగు. కాడ అడుగున వెడల్పుగా నున్నవి. పుప్పొడి తిత్తులు రెండు గదులు.
- అండ కోశము
- - అండాశయము ఉచ్చము. 4 గదులు ఒక్కొక్క కాయయందొక్కొక్క యండము గలదు. కీల పొడుగు.
- మట్టిపాల తీగ
- పెద్ద తీగె.
- ఆకులు
- - ఒంటరి చేరిక, లఘు పత్రములు, అడుగు వరకు చీలి యున్నవి. ఒక్కొక్క తమ్మె సమ గోళాకారము.
- పుష్ప మంజరి
- - కణుపు సందుల నుండి మధ్యారంబమంజరులు గలవు. పువ్వులు ఊదారంగు పుష్పములయొద్ద చేటికలు గలవు.