ఈ పుట ఆమోదించబడ్డది

305

రంగు వేయ వచ్చును. ఈ గింజలనుండి తీసినచమురును ఈ గింజల పొడుమును ఔషధములలో వాడుదురు. ముషిణి కలప గట్టిగానె వుండును.

ఇండుగ చెట్టు ముసిడి చెట్టుకంటె పెద్దది. ఈ చెట్లు కొండ్ల మీద మాత్రము పెరుగు చున్నవి. పండను తిందురు. గింజల నరగ దీసి మడ్డి నీళ్ళలో కలిపిన యెడల మడ్డి అడుగునకు పోవును.

నాగ ముసిడి
- కొండల మీద పెరుగును. ఆకులు సమ గోళాకారము, కణుపు పుచ్చములు లేవు. పువ్వులు కొంచమాకు పచ్చగను, పచ్చగను వుండును. దీని వేరు తాచుపాము కాటులకును విష జ్వరములకును మంచి పని చేయునందురు.
ఎర్ర ముష్టి
- టేకు చెట్ల మీద పెరుగును. పువ్వులు తెల్లగా నుండును.


నక్కెరి కుటుంబము.


ఇది కొంచెము పెద్దకుటుంబమే కాని ఉపయోగించు మొక్కలంతగాలేవు. ఈ కుటుంబములో గుల్మములు గుబురు మొక్కలు, పెద్ద చెట్లను గలవు. వాని కొమ్మల మీదను, ఆకుల మీదను రోమము లుండుట చే గరుకుగా నుండును. పు