ఈ పుట ఆమోదించబడ్డది

301

యు నదిమెరయుచును ఎత్తగా నుండుటచే చాల పనులకు పయోగించును. కొన్ని ద్రావకములలో బెట్టి శుభ్ర పర్చిన యెడల పట్టు వలెనే గనబడును. ఇన్ని యుపయోగములు వున్నను ఉపేక్ష చేయుటకు నార తీయుట కష్టగుటయే కారణము. మొక్కలను నీళ్ళలో నాన బెట్టితిమా అవి కుళ్ళి పోవును. కాన నాన బెట్టకుండ యంత్ర సహాయమున దీయ వలయును. కాని, దీనికి తగు యంత్రము లున్నట్లు గానవచ్చుట లేదు. నార తీయగ మిగిలి పోవు మెత్తని పదార్థము కాగితములు చేయుటకు బాగుండును. జెల్లేడు దూది మిక్కిలి మృథువుగాను మెరయుచు పట్టి వలె వుండును. కాని నూలు పనికి వచ్చు చున్నట్లు ఇది పనికి రాదు. నూలు నేసి నంత తేలికగా దీనిని నేయ లేము. ఇది మిక్కిలి తేలికగను సన్నము గాను వుండుట చే దీనితో నెట్టి పనులైన చేయుట కష్టమే కాని కొన్ని కొన్ని చోట్ల ఓపికతో నేసినవి పట్టు వాని కంటే బాగుగ నున్నవి. ఈ దూదిని మనము పరుపులలోను, తలగడలలోను నదురుగ వాడుదుము. ఈ దూది పరుపులు మిక్కిలి మెత్తగావుండును. ఇది చలువ చేయు నందురు.

దీని పాల నుండి కూడ రబ్బరు వంటి పదార్థమొకటి చేయవచ్చును గాని పాలను దీయుట కష్టము. ఈ మొక్క ఔష