ఈ పుట ఆమోదించబడ్డది

292

పాల చెట్లు మనఆంధ్ర దేశములో విస్తారముగ పెరుగు చున్నవి. ఇవి ఆకు లాలి చిగురించినపుడే పుష్పములు పూయును. లేత చిగుళ్ళును పుష్పములును గలసి నప్పుడెంతో ఇంపుగా వుండును. వీని కొమల ఈద నాటు పెట్టిన యెడల తెల్లని పాలు గారును. ఈ పాల నుండి రబ్బరు చేయ వచ్చును. వీని కలయయు మిక్కిలి బాగుండును. చిత్రిక పట్టిన పిదప దంతము వలె నున్నగాను, తెల్లగాను, కాంతి వంతముగాను వుండును. దీని తో దువ్వెనలు, బొమ్మలు చెక్కడపు పనులు చేయ వచ్చును గాని యందుల కుపయోగింపక వంట చెరుకు గానె తగుల బెట్టు చున్నారు. ఒక చెట్టును నరికిన యెడల దాని మొండెము నుండి చిన్న చెట్లు పెక్కులు బయలు దేరును. దీని గింజలు కొన్ని రంగులలో వాడుదురు. అవి జిగట విరేచనములకు మందందురు గాని అంతగా పని చేసి నట్లు గాన వచ్చుట లేదు.

పూతజిల్లేడుచెట్టు పాలచెట్టు వలె నుండును. దీని కలప మృధువుగా నుండి దువ్వెనలు, బొమ్మలు మొదలగు చెక్కడపు పనులకు బని వచ్చును. దీని ఆకులు, తిగుళ్ళు గొంజలు కూడ తేలు కుట్టునకు పాము కాటునకును బని చేయు నందురు. గింజలనుండి తీసిన చమురును మందులలో వుప