ఈ పుట ఆమోదించబడ్డది
290
- పుష్పకోశము
- - రక్షక పత్రములు 5. బల్లెపాకారము. కొన సన్నము. నీచము.
- దళ వలయము
- - సంయుక్తము. అడుగున గొట్ట్ము వలె గలసి యున్నవి. పైన వెడల్పగు ఐదు తమ్మెలు గలవు. కొన గుండ్రము. మొగ్గలో అల్లుకొని నట్లుండును. గొట్టముయెక్క కంఠము నుండి చిన్నచిన్న కాడలు గలవు.
- కింజల్కములు
- - 5. కాడలు లేవు. పుప్పొడితిత్తులైదును దళవలయము నంటి యుండును. వానిపై తెల్లని మెలి పెట్టిన కాడలైదు వచ్చును.
- అండ కోశము
- - అండాశయము ఉచ్చము. 4 తమ్మెలు గలవు. కీలము ఒకటి. గుండ్రము. పొట్టిది. కీలాగ్రము గుండ్రము. కాయకొక్కొక పుష్పము నుండి రెండు ఏకవృంత ఫలములు. గింజల నంటుకొని రోమములు గలవు.
- పాల చెట్టు
హిందూ దేశములో కెల్ల ఆంధ్ర దేశమునందెక్కువ పెరుగు చున్నది.
- ప్రకాండము
- - మాను వంకరగా నుండును. దీనికైవారము బాగ పెరిగినపుడు 4,...5 అడుగులుండును.
- ఆకులు
- - అభిముఖ చేరిక లఘు పత్రము. తొడిమ కురుచనిది. అండాకారము. సమాంచలము. విషమ రేఖ పత్రము. రెండు వైపుల నున్నగా నుండును.
- పుష్ప మంజరి
- - రెమ్మగెలలు కొమ్మల చివరలందుండి పుట్టుచున్నవి. ప్రతి గెల మొదట అండాకారముగ నున్న చేటికగలదు.