ఈ పుట ఆమోదించబడ్డది

288

నాలుగుమొదస్లు తొమ్మిది వరకు తమ్మెలుండును. అవి మొగ్గలో అల్లుకొని యుండును. కింజల్కములు రెం?డు కాడలు పొట్టి. అండాశయము ఉచ్చము. రెండు గదులు.

మల్లిపువ్వు చిరకాలమునుండి సువాసనకు ప్రసిద్ది చెంది యున్నది. ఇది వేసవి కాలమందు పుష్పించును. ఈ పువ్వుల నుండి అత్తరు చేయుదురు.

కుందము పెద్ద గుబురు మొక్క. దీనికిని పైకి పెరుగుట కాదారము కావలయును. పువ్వులు తెల్లగాను పెద్దవి గాను నున్నవి. మంచి వాసన గలదు.

అడవి మల్లి ఎక్కువగా కొండల మీద బెరుగును. దీని పువ్వుల రేకులు ఎనిమిది మొదలు పండ్రెండు వరకు వుండును. ఇదియు మంచి వాసన వేయును.

విరిజాజి తీగె పైదానివలెనే యుండునుగాని ఇది ఎగబ్రాకదు. చిన్నచెట్టువలె నుండును. ఆకులకు వాలముగలదు.

అడవిమొల్ల తీగె చుట్టుకొనిప్రాకును. ఆకులో మూడేసి చిట్టిఆకులు గలవు.

హేమవుష్పిక చిన్న చెట్టువలెనుండుదు. అన్నిఆకులు నొకతీరునలేవు. చివర నున్నవి పక్ష వైఖరిగ నుండును.