ఈ పుట ఆమోదించబడ్డది

281

చేటికలను, పుష్ప కోశము వద్ద చేటికలు గలవు. కణుపు సందుల నొక్కొక్కటియే యుండును.

మిధున పుష్పములు
- వీనికి వృంతము లేదు. పురుష పుష్పముల కంటె పెద్దవి.

మిధున పుష్పములు బూయని కొన్ని మగ చెట్లుకూడ కలవు.

పురుష పుష్పము.
పుష్ప కోశము
- సంయుక్తము. 4 తమ్మెలు నీచము.
దళ వలయము
- సంయుక్తము. తమ్మెలు తెలుపు రంగు.
కింజల్కములు
- 12 కాడలు వృంతాశ్రితములు. పుప్పొడి తిత్తులు సన్నముగా నున్నవి.
అండకోశము లేదు.
మిధున పుష్పము
- పుష్ప కోశము వద్ద నొకచేటిక గలదు.
పుష్ప కోశము
- సంయుక్తము. 5 తమ్మెలు. నీచము.
దళ వలయము
సంయుక్తము. 5 తమ్మెలు.
కింజలకములు
- 10 పుప్పొడి తిత్తులు చిన్నవి. పైకి గొడ్డు దాని వలె నగు పడును.
అండ కోశము
- అండాశయము ఉచ్చము. పలు గదులు గలవు. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క గింజ కలదు. కీలములు మూడు కీలాగ్రము చీలి యున్నది.

ఈ కుటుంబములో పెద్ద చెట్లును గుబురు మొక్కలే గానిగుల్మములు లేవు. ఆకులు సాధారణముగ ఒంటరి చేరిక.