ఈ పుట ఆమోదించబడ్డది

తుక్కువేసియే కాపి పొడియని అమ్ముచున్నారు. అన్యదేశము నుండి వచ్చిన కాపిపొడి కంటె మన ఇండ్లలో గింజలు వేయించి చేసికొనిన పొడి బాగుండుట కిదియే కారణము. కొన్ని కొన్ని చోట్ల కాఫీ గింజలకు బదులుగా తగరిన కసింత జాతి మొక్కల గింజలనుపయోగించు చున్నారు.

క్వైనా
పుష్పము. కాయలు.


కాపీత్రాగుట మన దేశములో నిప్పుడెక్కువైనది. కాపిత్రాగుట కలవాటు పడని వారదిఏమి పాపమో అనాగరికులుగ నెంచ బడుచున్నారు. పల్లెటూరులందు సైతము కాపి విస్తారముగ వ్యాపించినది. మొగపెళ్ళివారి నిబంధనలలో నిది యొకట