ఈ పుట ఆమోదించబడ్డది

244

కొమ్ముపొట్ల పువ్వులు పెద్దవి. కాయలను కూర వండు కొందురు. ఆకుల రసము, వేళ్ళ రసము కూడ ఔషదములలో వాడు చుందురు.

అడవి పొట్ల కాయలు చేదుగా నుండును. కాన సాధరణముగ తినరు. ఎండిన లేత కొమ్మలు కాయలు గింజలు కూడ ఔషదములలో వాడుదురు.


పొట్టి బుడమ తీగె డొంకల మీద ప్రాకును. తీగె సన్నము. కాయలు చిన్నవి. వీని నంతగా వాడుచుండి నట్లు గనవచ్చుట లేదు.

పాము బుడమ
- ఆకులు మిశ్స్రమ పత్రములు. పువ్వులు పచ్చగాను, చిన్నవి గాను నుండును. కాయ మూడుపలకలు,. మిక్కిలి చేదుగా నుండును. దీని గింజల నుండి తీసిన చమురుతో దీపములు వెలిగించుకొన వచ్చును.

నల్లబుడమ పాముబుడమ కంటే చిన్నది. కాని పువ్వులు పెద్దవి. దీని కాయలను వాడుటలేదు.

కొండ బుడమ
- ఆకులు కొంచెమించుమించు చిక్కుడు గింజ ఆకారముగ నుండును. కాయలు గుండ్రము.