ఈ పుట ఆమోదించబడ్డది

243

ములు నాలుగు కలిసి రెండుగా ఏర్పడినవని యూహించుచున్నాము. అండ కోశము నీచము. కాయపై పెంకు కాండకాయ.

గుమ్మడి తీగెలు ఇసుక నేలలో ఏపుగా పెరుగును. వీని కాయలు మిగుల పెద్దవి. అవి చాల కాలము నిలువ యుండును. ఎండి పోకుండ వానిపై నున్న బిరుసైన చర్మము కాపాడు చున్నది. దీనిని కూర గాయగాను, పులుసులోను వాడుదుము.

బూడిద గుమ్మడి
- ఆకులు బొడుగగు నైదు తమ్మెలు గలవు. దీని గింజలను వర్షము లారంబించిన పిదప పాత వలెను. ఒక్కొక్క చోట రెండు గింజలకంటె పాతుట మంచిది కాదు. ఈ తీగెలకు నెరువును, నీరును తరచుగా దగులు చుండ వలెను. చిన్న మొక్కలుగా నున్నప్పుడు పురుగు పట్టుటయు గలదు. లేత కాయలను గొందరు కూర వండు కొందురు. ఈ కాయలపై నుండు తెల్లని బూడిద కాయలెండకు ఇగుర్చుకొని పోకుండ కాపాడును.
పొట్లకాయలు
- ఇవి వర్షాకాలములో కాయును. ఆకుల మీద గరుకగు రోమములు గలవు. వాని యందొక వాసన గలదు. గరుకగు రోమములుండుట చేతను, వాసన యుండుట చేతను సాధ్యరణముగ తీగెలను పసువులు దినవు. తరుచుగా తీగెలక్రింద రాలియుండు పువ్వులు మగ పువ్వులే.