ఈ పుట ఆమోదించబడ్డది

240

పురుష పుష్పములు

పుష్పకోశము:- సంయుక్తము, 5 తమ్మెలు గలవు. ఆకు పచ్చరంగు తమ్మెలు సన్నముగా నుండును.

దళవలయము
- సంయుక్తము. 5 తమ్మలు, పశుపు రంగు పుష్ప కోశమునంటి యుండును.
కింజల్కములు
- 3 రెండింటి పుప్పొడి తిత్తులకు రెండేసి గదులు గలవు. కాని యొక దానికి నొకటే గది గలదు. పుప్పొడి తిత్తులు మెలికలు తిరిగి యుండును.
స్త్రీ పుష్పము

పుష్పకోశము దళవలయము. పైదాని యందువలె నుండును. అండ కోశము. అండాశయము:


గొమ్ముపొట్ల.

కొమ్ముపొట్ల తీగలు:- హిందూస్థానమునందెక్కువగా గలవు. కొన్ని తీగెలు మగవి. కొన్ని ఆడువి; మగ తీగలు మగపుష్పములను ఆడు తీగలు ఆడు పుష్పములను బూయును. నులి తీగలు చీలి యుండును.

ఆకులు
- ఒంటరి చేరిక, హృదయాకారము. నిడివి చౌకముగాగూడ నుండును. తొడిమపై రోమములుగలవు. విషమ రేఖ పత్రము కొన సన్నము అంచునపండ్లుగలలవు.