ఈ పుట ఆమోదించబడ్డది

లవంగములు లవంగ వృక్షము యొక్క ఎండిన మొగ్గలు. లవంగములో నాలుగు దందములవలె నున్నవే రక్షక పత్రములు. వానిమీద గుండ్రముగ నున్నది వికసింపని దళ వలయము. ఈ వువ్వుల మొగ్గలను వికసింపక పూర్వమే గోసి వైతురు. రజోసంయోగమైనచో కాయకాచును. ఆకాయలో నొకటి రెండు గింజ లుండును.

లవంగముచెట్ట్లను బెంచుటకు మళ్ళలో నడుగడుగు దూరమున కాయలు పాతెదరు. కాయలెంత ఎండకుండ నుండిన అంత మంచివి. ఎండినచో వాని శక్తి తగ్గి పోవును. పాతిన నాలుగైదు వారముల కవి మొలకలెత్తును. చిన్న మొక్కలు నాలుగడుగు లెత్తు పెరిగగానే వానిని దీసి తోటలందు ఇరువది ముప్పది అడుగుల దూరము దూరముగ నాటుదురు. ఈ చెట్లకు రాగిడి నేల గాని ఇసుక నేల గాని పనికి రాదు. బురదనేలలో మెలవనే మొలవదు. కొంచెము ఇసుకతో కూడిన ఒండ్రు మట్టి నేలలు మంచివి. వీనికి నీటి యాధారము బాగుండ వలయును. సముద్రపు గాలులు తగులట మంచిది గాదు. ఆరేండ్లు వచ్చు నాటికి ఈ చెట్లు కాపు లోనికి వచ్చును. నూరు నూట యేబది సంవత్సరముల వరకు లవంగములు వచ్చు చున్నను, ఇరువది ఏండ్లయిన తరువాత వాని కాపు తగ్గి పోవ నారంబించును. కొన్నిచోట్ల లవంగములను సులభముగ కోయుటకు చెట్టు ఎనిమిది తొమ్మిది అడుగులెత్తు పెరుగగనే చిగురును కత్తిరించి వైతురు. లవం