ఈ పుట ఆమోదించబడ్డది

ను పిడేళ్ళు, పిల్లంగోరులు మొదలగు సంగీత సాధనములు చేయుటకు బాగుండును. దీని పప్పు మనము తినము గాని ఐరోపా దేశస్థులు నిలువ చేసి తిందురు. దీని నుండి జిగురును వచ్చు చున్నది. అది మంచిది కాదు.


ఉప్పుపొన్న కుటుంబము.


ఈ కుటుంబపు చెట్టు నీటితీరముల బురదలో పెరుగును. ఆకులు అభిముఖ చేరిక, కణుపు పుచ్చములుండును. ఈ కణుపుచ్చములు తొగరు చెట్టు నందున్నట్లు రెండాకులకు మధ్యగా నుండును. మిధున పుష్పములు. పుష్పకోశము అండాశయము నంటి స్థిరరముగా నుండును. ఆకర్షణ పత్రము రక్షక పత్రములన్ని యుండును. కింజల్కములు వానికి రెట్టింపు. అండకోశము ఉచ్చము. కాయ బ్రద్దలవదు. ఈ చెట్టు మెత్తని బురద నేలలో బెరుగును గాన గాలికి బడి పోకుండ నుండుటకు మాను నుండియు గొమ్మల నుండియు గూడ వ్రేళ్ళు క్రిందికి దిగు చుండును. కొన్ని చెట్లలో గింజలు కాయ నుండి బయటకు బడకమునుపే, గింజలలో నుండి వ్రేళ్ళు క్రిందకు వచ్చుచున్నవి.

ఉప్పుపొన్న చెట్లు బెరడు నుండి యొక రంగును తోలు బాగు చేయు పదార్థమును దీయ వచ్చును. కాని ఈ పదా