ఈ పుట ఆమోదించబడ్డది

గింజలు వీనినుండి తీసినచమురును, పప్పును ఔషధముల యందు ఉపయోగించురు. నూనె దేహమునకు రాసికొనిన లావణ్యము వచ్చు నందురు. కాయలు గాల్చిన బొగ్గు పండ్ల జబ్బులకు మంచిది. ఆకులను వేళ్ళ బెరుడును కాయలకు బదులుగా ఉపయోగింప వచ్చును గాని యంతగా పని చేయవు.

నూనిగచ్చ:- మొక్కలు చిరకాలమునుండి మన దేశములో బెరుగుచున్నవి గాని దాని గుణ విశేషము మొన్న మొన్నటి వరకు దెలియలేదు. దీనిగింజలలో చర్మములు బాగు చేయుటకు పనికి వచ్చు పదార్థము చాలకలదు. దాని నిప్పుడు వాడుచున్నారు.

బుక్కా చెట్టు:- కాయలనుండి ఇదివరకు ఎర్రరంగును చేయు చుండెడి వారు గాని ఇప్పుడు చౌక రంగులు పై దేశములందుండి వచ్చుట చేత మాని నారు.

తురాయి:- చెట్లు పలుచోట్లగలవు. ఆకులు ద్విభిన్న పత్రములు. పువ్వులెర్రగాను, పెద్దవిగాను వుండును. ఆకురాలి యున్నప్పుడు పుష్పించును.

చెమ్మ తీగెలు:- డొంకలమీదప్రాకును. ఒక్కొక్క కాడమీద రెండేసి యూదా పుష్పములున్నవి. పుష్పకో