ఈ పుట ఆమోదించబడ్డది

ను పుష్పించి కాయలుగాయనిచ్చెదరు. ఒక పొలములో సదా వీనినే పండించుట కంటె మరి యొక పైరు చేయుట మంచిది. దానికి ముందుగా బొలమును నీలి రొట్ట తోడనే దమ్ము చేసిన యెడల సార వంతమగును.

నీలిరొట్టను యంత్రశాలకు గొనిపోగానే వానికొరకు కట్ట బడిననూతులలో వేసెదరు. ఈనూతురులు 20 అడుగులు చతురముగను 4.... 5 అడుగులు లోతు గాను నుండును. వీని పైననీరు నిలువ చేయుటకు సీసపు రేకులతో జెరువులవలె కట్టుదురు. ఈ చెరువులలో నుండి నూతి లోనికి గొట్టముల ద్వార నీరు వచ్చును. ఆ నూతులలో నీలి రొట్టను వేసి, నీరు రానిచ్చి 10 ...15 గంటల వరకు నాననిచ్చెదరు. అప్పటికి నీరునకొక విధమగు పచ్చని రంగు వచ్చును. ఈ నీరును ఆ నూతుల క్రింద నున్న చిన్న నూతులలోనికి బోనిచ్చెదరు. ఇవియు పైవాని వలెనే యుండును గాని అంత లోతుండవు. రసమంతయు వీనిలో ప్రవేశించిన పిదప పదిమంది కూలి వారు దిమ్మిసాలాతో గంటన్నర వరకు మోదెదరు. కొన్నిచోట్ల గూలివారు బాదుటకు బదులుగా ఆవిరి సహాయమున నందులో గొన్నిచక్రములను ద్రిప్పుదురు. మరికొన్నిచోట్లదిమ్మిసాలతో గొట్టుట మాని యెడ తెగకుండనా