ఈ పుట ఆమోదించబడ్డది

అనపచిక్కుడు:- గింజలను అనుముల వలె నుండును. కాని అనుములట్లు వాసన వేయవు.

అడవిచిక్కుడు:- పై దాని వలె నుండను కాని మొక్క కొంచ మెర్రగా నుండును.

కంచిచిక్కుడు:- తీగెకు నాకులయడుగున మెరసెడి రోమములు గలవు.

గోరుచిక్కుడు:- కాయలుచిన్నవి. ఆకుల తొడిమలు మూడు పలకలుగా నుండును. పువ్వులు గులాబిరంగు; మొట్టమొదట చిక్కుడుపువ్వులవలె నుండును. కాని దానినేదైన తాకినచి మరింత వికసించును. దాని మూలమున పుప్పొడి ఎగిరి దగ్గర నున్న పువ్వుల మీద గాని ఆ పువ్వుల మీద వాలుటకు వచ్చిన తుమ్మెద మీద గాని పడును. ఈ పువ్వులలో నీరీతిని రజస్పర్శము గలుగు చున్నది.

కందులు:- పప్పులలోనికల్ల మనము విశేషముగా వాడునది కందిపప్పు. అది మనకు ప్రతి దినము నావశ్యకమైన పదార్థము. మన యాహారపదార్థములలో మిక్కిలి బలము నిచ్చునదియు నిదియే. కందులు మెరక పంట. వీనిని మరియొక పైరుతో గలిపి యైనను ప్రత్యేకముగా రెండ