ఈ పుట ఆమోదించబడ్డది

పుప్పొడి తిత్తుల క్కొక్కటియే గది. గొడ్డు కింజల్కములు గూడ గలవు. పుష్ప కోశము నంతి పళ్ళెరము కూడ గలదు. అండాశయము ఒక గది. అండములు రెండు వరుసలుగా నున్నవి. గింజల పొర (బహర్త్వక్కు) రెక్కల వలె వెడల్పుగానున్నది. కీలాగ్రము మీద రంధ్రములు గలవు.

ములగచెట్టు:- జాలచోట్లనే పెంచుచున్నారు. దీని నుండి మంచి జిగురు వచ్చును. అది మొదట, తెల్లగనే నుండును గాని క్రమ క్రమముగా నెర్రబడును. గింజలనుండి పరిశుభ్రమగు నూనె వచ్చును. దీనిని మరలకు రాయుటకు వాడుదురు. కాని మన దేశములో నెందు చేతనోగాని నూనె తీయుట లేదు. ఈ నూనెకు సువాసనలను బీల్చి, వానిని పోకుండ నుంచుకొను గుణము గలదు. కావున వట్టి నూనెలు చేయుటలో దీనినిగూడ వాడుదురు. కొందరు ములక కాడలనే గాక పువ్వులను, ఆకులను కూడ కూర వండుకొనెదరు.

మధుశిగ్రువము:- ఒకరకము ములగ చెట్టు దీని పువ్వులెర్రగా నుండును.