ఈ పుట ఆమోదించబడ్డది

మారాటతీగె:- అడవులలో జెట్ల మీద బ్రాకు చుండును. ఆకులకు కణుపు పుచ్ఛములు గలవు. ఎఱ్ఱని చిన్న చిన్న పువ్వులు పూయును.

కనపతీగె:- బల్ల పరుపుగా నుండును. వువ్వులు తెలుపు.


కుంకుడు కుటుంబము

కుంకుడుచెట్లు మనదేశములో జాలచోట్ల బెరుగుచున్నవి.

ఆకులు:- మిశ్రమ పత్రములు. ఒంటరి చేరిక. కణుపు పుచ్ఛములు లేవు. చిట్టి యాకులు మూడో, నాలుగో అయిదో యుండును. సమాంచలము. విషమ రేఖ పత్రము. దట్టముగాను బిరుసుగాను నుండును. కొన సన్నము. ఒక్కొక్కప్పుడు ఖనితము.

పుష్పమంజరి:- కొమ్మల చివరల నుండి రెమ్మ గెలలు. తెల్లని చిన్న పువ్వులు. చేటికలు గలలవు. పువ్వులకు వాసన లేదు.

పుష్పకోశము:- రక్షక పత్రములు 5 సమముగా నుండును, నీచము

దశవలయము:- 5 ఆకర్షణపత్రములు, సమముగానుండును. పైన రోమములు గలవు.

కింజల్కములు:- 8 పొట్టివి. కాడల యడుగున రోమములు గలవు. పుప్పొడి తిత్తులు 2 గదులు, కింజల్కముల చుట్టు పళ్ళెరము గలదు.