ఈ పుట ఆమోదించబడ్డది

గళ్ళు, పడవలు మొదలగునవి చేయుదురు. వేపచెట్ల గాలిని శుబ్రపరుచును. అది ఎక్కువగా నున్న చోట్ల కలరా తక్కువగా నున్నది. ఇవి చల్లని నీడ నిచ్చును

తురకవేప-: చెట్లును పెద్దవియె. వీని యాకులు ద్వి భిన్నముగను త్రి భిన్నముగను కూడ నుండును. దీని వేరు బెరడు గింజలను కూడ కొందరు ఔషధములలో వాడుదురు. దీని గింజలతో తాళవమును చేయుదురు.

బిళ్ళుచెట్టు:- రాతి నేల లందు బెరుగును. ఆకులు పక్ష వైఖరి. చిట్టి యాకు లిరువది జతల వరకు నుండును. దీని కలప చాల బాగుండును.

గారుగు:- చెట్టు మిక్కిలి పెద్దది. వేసవి కాలమందు బుష్పించును. దీని కాయలను తిందురు.

వల్లరసి:- పెద్ద చెట్టు. శీతాకాలము నందు పుష్పించునును. దీని బెరడును చాల చేపలుండు నెచ్చట నైనను వేసినచో నవి పైకి తేలి త్వరగా బట్టు వడును. కలపయు బాగుండును.

చిన్నవల్లరసి:- కొండల వద్ద బెరుగు చిన్న చెట్టు. ఆకులకు మూడేసి చిట్టి యాకులున్నవి.