ఈ పుట ఆమోదించబడ్డది

పత్రము మొదట నొక అతుకు కలదు. అయతుకు వద్దకు దానిని సరిగా నిరువ వచ్చును. లఘు పత్రమైనచో నిట్లతుకుండదు. ఇది మిశ్రమ పత్రముగా బుట్టవలసినది. చిక్కుడాకులో మూడి చిట్టి యాకులున్నవి గదా. వీనిలో మధ్యగా నున్న చిట్టి యాకు నుంచి ప్రక్కనున్న రెండింటిని త్రుంపి వేయ నెట్లుండునో, అట్లే నారింజ ఆకున్నది. తొడిమ కిరుప్రక్కల వెడలుపైయున్నది. ఆవెడలుపై తొడిమరెక్కల వలెనున్న భాగము కూడ ఆకుల వలె బని చేయును. పత్రము సమగోళాకారము. సమాంచలము; దట్టముగా నున్నది. దానిలో గ్రంధి కణము లుండుటచే వాసన గలదు.

పుష్పమంజరి:- కణుపు సందులందుండి మధ్యారంభ మజరులు పుష్పములు సరాళము. సంపూర్ణము.

పుష్పకోశము:- సయుక్తము. గిన్నెవలెనున్నది. నీచము

దళవలయము:- అసంయుక్తము. 5 ఆకర్షణ పత్రములు. తెల్లగా నుండును. మంచి వాసన గలదు.

కింజల్కములు:- అసంఖ్యములు. కాడలు పొడుగు. పుప్పొడి తిత్తులు రెండు గదులు. కింజల్కముల మధ్య పల్లెరము గలదు.

అండకోశము:- అండాశయము ఉచ్చము. పలు గదులు గలవు కీలము ఒకటి లావుగ నున్నది. కీలాగ్రము గుండ్రము. పలము కండ కాయ.


ఈ కుటుంబములోని చెట్లమీద ముండ్లు గలవు. ఆకులు ఒంటరి చేరిక, మిశ్రమ పత్రములు కొన్నిటిలోఒక్కటియే చిట్టియాకుగలదు. ఆకులకు సువాసన గలదు. పుష్పములునరాళములు సంపూర్ణము. పుష్ప కోశము సంయుక్తము.