పేరంటకూర:- (గోనినారమొక్క) ఈ మొక్కలను బంగాళదేశము నందే పైరు చేయు చున్నారు. దీని నుండి తీసిన నారతోడనే గోని సంచులు నేయుదురు. ఈ సంచులది, జనప నార కాని, గంజాయి నార గాని, గోగు నార గాని కాదు. ఈ మొక్క లించు మించు ఎట్టి నేలలోనన్నను పైరు కాగలవు. రాగిడి నేలలును, ఒండ్రు మట్టి నేలలును మంచివి. ఇవి పెరుగుటకు వర్షములు సంవృద్ధిగ నుండవలెను. సార వంతమగు భూములగుచో పెంట యంతగ నక్కర లేదు. పొలము దున్ని విత్తనములను వెదజల్లుదురు. పుష్పింపక పూర్వము గోసిన యెడల నార గట్టిగ నుండును. కాయలు గాచిన వెనుక గోసిన యెడల గట్టిగానే యుండును గాని ముతగగనుండుడు. కావుల పుష్పించి కాయలు కాయక పూర్వము గోయుట మంచిది.
మొక్కలను గోసిన పిదప వానిని కట్టలు గట్టి దగ్గరనున్న చెరువులోనో, నీళ్ళ కుంట లోనో ఊర వేసెదరు. ఇందులకు ఉప్పు నీరు పనికి రాదు. ప్రవహించు చున్న నదులు గాని కాలువలు గాని మంచివి కావు. నికలడగ నున్న నీరు మంచిది. అట్టి నీటిపై గట్టల నొక దానిపై నొకటి చేర్చి నీటి లోమునుగునట్లు బరువు దేనినైన బెట్టుదురు. అవి చీకి నార సులభముగ వ