ఈ పుట ఆమోదించబడ్డది

అండకోశము:- పుప్పొడితిత్తులచే నావరింపబడియున్నది. 5 తమ్మెలున్నవి. కీలము 1. లావుగ నుండును. కాయలో నొక గదియే గలదు. అండాశయము నందున్న మిగిలిన నాలుగు గదులు పెరుగవు.


ఈ కుటుంబ ముష్ణ ప్రదేశమూలో గలదు. దీనిలో చిన్న మొక్కలౌ మొదలు పెద్ద చెట్ల వరకు నున్నవి.

ఈ కుటుంబపు ప్రతి మొక్క యొక్కలేత కొమ్మమీదను లేత యాకుల మీదను దట్టముగా గోధుమ వర్ణముగల రోమములుగలవు. ఈ రోమములు ఆముదపాకుల మీద నున్న తెల్లిని పొడివలె లేత యాకులను ఎండకు వాడి పోకుండ గాపాడును. వీనిలో ఆకులు అభిముఖ చేరిక, లఘు పత్రములు లేదా, తాళ పత్ర వైఖరినున్న మిశ్రమ పత్రములు. కణువు పుచ్చములు గలవు. వువ్వులు చిన్నవి. ఆకర్షణ పత్రములు కొన్నిటియందు లేవు. కింజల్కలములన్నియు గలిసియుండును. పుప్పొడి తిత్తులు రెండు గదులు. అండ కోశము 5 గదులు. ఒక్కొక్కప్పుడు కాయలోని గదులు విడిగా నుండును.

కావలిచెట్టు:- కొండ ప్రదేశముల నుండును;. ఆకులు లఘుపత్రములు. పచ్చని పువ్వులు, పురుష పుష్పములు మిధునపుష్పములు గలసియుండును. ప్రతి పుష్పము 5 కాయలు కాచును. దీని కలప మెత్తగా నుండుటచే నంతపనికి రాదు.