ఈ పుట ఆమోదించబడ్డది

111


ఈకుటుంబములోని చెట్ట్లన్నియు పెద్దవృక్షములే. వీని నన్నిటినుండు గుగ్గిలము వంటి పదార్థము వచ్చును. ఆకులు ఒంటరి చేరిక లఘుపత్రములు. వీనికి చిన్నచిన్నకణుపు పుచ్చములున్నవి. పువ్వులకు మంచి వాసన గలదు. ఆకర్షణ పత్రములు సాధారణముగ మొక్కలో మెలిపెట్టినట్లుండును. కీలాగ్రములు మూడు.

గుగ్గిలము
-

చెట్లు హిమాలయ పర్వతముల ప్రాంతములను, రాజమహాలుకొండలవద్దను, ఒరిస్సా, మధ్యపరగణాలు, అంధ్రదేశములోను ఎక్కువగా బెరుగు చున్నవి. ముదురు చెట్లను మూడు నాలుగుగడుగులెత్తున చెట్టు పరిమాణమును బట్టి నాలుగైదు చోట్ల {బెరడు} గీసెదరు. ఆ చారలలోనికి అరపూస వంటి పదార్థము వచ్చి చేరును. అధి మొట్టమొదట తెల్లగానే యుండును గాని తరువాత కొంచెము గోధుమ వర్ణము వచ్చును. ఇదియే గుగ్గిలము. దీనిని తీసివేసినతరువాత కొన్ని నెలలకు ఆచారలోనే మరికొంత చేరును. ఇట్లు మూడుమాట్లు తీయవచ్చును గాని మాటి మాటికి తక్కువ రకము వచ్చుచుండును. గుగ్గిలము నౌషధములలో వాడుదురు. దీనిని లోపలి కివ్వరు గాని కొన్ని మందులతో గలిపి పైన రాయుచుందురు. దురువాసన బోగొట్టు