ఈ పుట ఆమోదించబడ్డది

90

కింజల్కములు
.... 8 . వృంతాగ్రము ఆకర్షణ పత్రముల మధ్యనుండి పైకి వచ్చి యున్నది. దీనినే కింజల్కమౌలంటుకొని యున్నవి.
అండకోశము
... అండాశయము ఉచ్చము. దీనికిని కింజల్కములకును మధ్య వృంతాగ్రము పొడుగగనే యున్నది. ఒక గది. అండములు చాల గలవు. కాయ ఎండి పగులును. కీలము లేదు. కీలాగ్రము పెద్దది. దానిపై రంధ్రములు గలవు.
మావలింగము చెటేటు
... మనదేశపు పడమటి తీరమున విరివిగాబెరుగుచున్నది గాని అంతటను దోటలందు బెంచు చున్నారు. మార్గ శిర ప్రాంతముల నాకులు రాలి వేసవి కాలమందు ఆకులును బువ్వులును గలిసి వచ్చును.
ఆకులు
... కొమ్మల చివర గుబురులుగా నుండును. ఒంటరి చేరిక, మిశ్రమ పత్రములు, మూడేసి చిట్టి యాకులు గలవు. ఇవి అండాకారముగనైనను, సమ గోళాకారముగనైనను బల్లెపాకారముగ నైన నుండును. సమాంచలము. కొన వాలము గలదు. చిట్టి యాకులకు జిన్న తొడిమలు గలవు. అవి యతుకు పెట్టినట్లుండును.
పుష్పమంజరి
... కొమ్మల చివరలనుండు గుత్తులు.
పుష్పకోశము
... రక్షక పత్రములు నాలుగు. త్వరగ రాలి పోవును.
దళవలయము
.... ఆకర్షణ పత్రములు నాలుగు. పాదములు గలదు. అధశ్చర అండాకారము. కొంచము పసుపు రంగుగ నుండును.
కింజల్కములు
..... అసంఖ్యములు. కాడలు ఆకర్షణ పాత్రము లం పొడవు.
అండ కోశము
..... అండాశయము ఉచ్చము. ఒక గది. దీనికిని కింజల్కముల మధ్య నుండి వచ్చిన వృంతాగ్రము గలదు. కీలము లేదు. అండములు రెండు వరుసలు. కుడ్య సంయోగము. ఫలము కండకాయ.