ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఋషిపంచమివ్రతము

క్షీరాన్న భాండమునందు పాము విషముఁ గ్రక్కగా, నేను జూచి దానిని ముట్టితిని. అప్పుడు సుమతిభార్య నన్నుఁ జూవ మోఁది నాకు సన్నముఁ బెట్టదయ్యె. నేనేమి చేయుడు”నని పరిత పింపఁగా, వృషభరూపంబుదాల్చిన యాసుమిత్రుడు శునీ రూపయైన తనభాగ్యను జూచి, "ఓసీ నా యవస్థల నే నేమి చెప్పదును. నేఁడు నాకు శ్రాద్ధదినసుబై యుండియు, నా పుత్ర్యుడు నన్ను మూతిగట్టి నాచే దున్నించి, నన్నుఁ గొట్టి నానాహింసలంజెను. వాఁడు నామూతి బిగియఁగట్టుట చే నేను బిడికెడన్న మైనసు దిననైతిని. నాయవస్థ యేమి చెప్ప చును" అని పిలి కిట. అప్పుడు కుమారుఁడు వీరిసంవాదమును విని యునియమున లేచి, వారికి గ్రాసంబు పెట్టి, వారిపోపంబు దొలఁగింపఁగోరి, పుణ్యతపోవనంబుల కేగి, యచ్చటి మునీంద్రు లకు సాష్టాంగముగాఁ బ్రాణమిల్లి, తనతల్లిదండ్రుల కట్టిదుర్దశ యేల ప్రాప్తించి నని యడుగఁగా, నాతపోధనులగు మునీంద్రు లాతనికి వారి తల్లిదండ్రులకుఁ గలిగిసజన్మాంతర పాప కృత్యంబు నెఱిఁగించి, యది పోవుటకుఁ దగిన యుపాయంబు ఋషి పంచమీ ప్రతాచరణమే. దాని నాచరించి, తత్ఫలంబు వారికిచ్చిన యెడలఁ బాపవిముక్తు లగుడుగని చెప్పెను. అంతట నాతఁడు వారివలన ఋషి పంచమీ వ్రతవిధానంబును నెఱిఁగి, యావ్రతంబురు నాచరించి యాఫలంబును దసతల్లిదండ్రులకు ధారపోయఁగా, వారు పాపవిముక్తులై మోక్షముకొందిరి. అని కృష్ణుఁడు ధర్మరాజుతోఁ జెప్పఁగా, నంతట ధర్మరాజు కృష్ణునిఁజూచి, యావ్రతమున కుబ్యాసనవిధానంబు నెఱిం గింపుఁడని యడిగిన నతఁ డిట్లనియె. మొదటిదినమున నొంటి పూఁట భుజించి, మఱునాఁడు వేకువలేచి స్నానాది క్రియలు