ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదియవ ప్రకరణము

81


భటుఁడు ' నీ విపుడు మాఖయిదీవి.” అనెను. అతఁడు లోలోన మండుచుండెను. జగన్మోహిని కేమి యపాయమువచ్చునో యని విలపింపఁజొచ్చెను. కాని, ఏమిచేయఁగలఁడు ? పాపము ! కోఱలు తీసిన సర్పము.

సమీపమున నే మఱియొక భవనముండెను. అందు జగన్మోహిని పరుండి యుండెను. ఆమెకుఁ "కొంచెము సమీపముగా స్వర్ణ కుమారి నిద్రించెను. పాపమా మనోహ రాంగుల గతి యేమైనదో !

అదిగో ! చూడుఁడు. కాఱు మెఱుపుఁ దీవియవలె మెఱు యుచున్న యూ జగన్మోహిని మొగ మెట్ల' క్రోధ భయాశ్చర్య రసములచే శోభించుచున్నదో ! ఎదుట నిలువబఁడిన తురు ష్కునితో" నేదో నామె యనుచున్నది. 'ఓరీ ! యీ యర్ద రాత్రి వేళ నీవిచటి 'కెట్లు వచ్చితివి ! నీవెవఁడవు ? ”

అతఁడు జవాబీయ లేదు. ఆ మనోహరమూర్తి వంక గండ్లారఁ జూచుచుండెను. ఆమె మరల నా ప్రశ్నమే యడిగెను . " నేను దురుష్కుఁడను. నిన్ను గొంపోవ వచ్చితిని. అనియెను.

“ఓరీ! పాపీ ! నీ వెచటికి బోఁగలవు? ప్రాకారమునఁ గావలియున్న వారెల్లరు నిన్ను ఖండ ఖండములు చేయరా ! వారిం దప్పించుకొని యెట్లు వచ్చితివి ? చేత ఖడ్గము లేదు కాని యున్నచో నీ బోంట్లకు వారుకూడఁ గావలయునా ? ' నిసర్గ