ఈ పుట అచ్చుదిద్దబడ్డది

80

విజయనగర సామ్రాజ్యము


సర్వవిధములఁ గూతునకుఁ దగిన లోకోత్తరుఁడగు సుందరుఁడు దొరకన నతని కెంత సౌఖ్యము ?

ఎట్టకేల కతఁడు, నిద్దురవోయెను. కాని, యీగ కేని చొరశక్యము కాని యా సౌధోన్నత భాగము నందలి యాగది లోఁబెద్ద చప్పుడాయెను. అదియతని నిద్రకు భంగము కలుగఁ జేసెను. అతఁడు కన్నెత్తి చూచెను. అతని కొక వికారమగు దీర్ఘ విగ్రహము పొడకట్టెను. అది మనుజుని విగ్రహ మే కాని రాక్షసునిది మాత్రము కాదని యతఁడు తలఁచెను. అతఁడాఱడుగుల కంటెఁ గొంచెము పొడవుగానుండెను. అందుఁ బ్రకాశించుచున్న దీపపుంగాంతి నతని మొగము కన్పడెను. అది నల్లని బొగ్గు, కాఱు మేఘము లాకాంతికిఁ దీసిపోవును. కటిక చీకట్లు కూడ నా మొగపుఁ గాంతికిఁ జూలవు. ఆ మొగము భయంకరమై యతని క్రౌర్యమును దెలి యఁ జేయు చుండెను. సోమ శేఖరమూర్తి తన దీర్ఘ మగు కత్తి కొఱకుఁ దడవిచూచెను. అది లేదు. అతఁడు తటాలున నా భటుని పై కుఱుకఁ బోయెను. కాని వెనుక నుండి యిరువురు మ్లే చ్చులు వచ్చి వానింబట్టుకొని చేతులు కట్టిరి. అతని మొగము క్రోధమయమై పోయెను. కనులు నిప్పుకలు .గ్రక్కుచుండెను. • ఓరి నీచుఁడా:! దొంగవ లెవచ్చితివే మీరా ! శౌర్యమున్న బోరాడుము. నీశిరము నూర్వక్కలు చేసెదను' అనెను. సామదానములు ప్రయోగించెను. లాభము లేకపోయెను. ఆ