ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదియన ప్రకరణము

79


కావు. మల్లికా కుసుమములను గాని గులాబిపూలను గాని తెచ్చి యొక చోనుంచి పరిమళింపకుఁడన్న నాఁగఁ గలవా ? అత్యంత మనోహరమగు తత్సువాసన వ్యాపింపక మానునా! శుభాశుభ వార్తలుగూడ నట్టివే. వానికిఁ బక్షులకంటె గమనము హెచ్చు. రాత్రింబవళ్లు, వర్తమానములు ప్రపంచ మును జుట్టి వచ్చుచుండును. జగన్మోహిని వివాహవా ర్తయు నా పెను విజయసింహున కీయ .నెంచుటయుఁ బ్రపంచమెల్ల వ్యాపిం చెను. ఎల్లరును సంతసించిరి.లోకమునకు సమగుణ శోభితులయిన దంపతులవివాహము మిక్కిలి యానంద దాయకము. కాని లోక మెల్ల నొక తీరుగా నుండదు. ఒక రికి రుచించిన దొకరికి రుచింపదు. మనము తలఁచిన కార్యము లెల్ల ననుకొన్నట్లు జఱుగఁజాలవు. మన మొకటి తలఁచిన దైవ మొ కటి తలఁచును.

ఆనాఁటి రాత్రి యట్లు చాల సేపటినటకు మఱునాఁడు జఱుగు లగ్న నిశ్చయముం గూర్చియు వరుని గుణములం గూ ర్చియు వధూవరుల పరస్పరాను రాగముంగూర్చియు నతఁడు తలపోసెను. అతనికి నిద్దుర రాలేదు. అది స్వాభావికము. కూతుండ్ర 'పెండ్లిండ్లు సేయుట తండ్రులకు మిక్కిలి కష్టము. సమగుణవయో రూపవంతులు దంపతులగుట మిక్కిలియరిది. వధువు తండ్రి యట్టిగంణవంతుఁడగు భర్తను దేవలసియు న్నాఁడు. కూతునకుఁ దగనిభర్త దొరకిన నతని కెంత కష్టము !