ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పది య వ ప్రకరణ ము


.

చీకటి

విజయసింహుఁడు బయలు దేఱి శృంగారపురము నుండి విజయ నగరమునకుఁ బోయెను. అతఁడు వెళ్లి యిప్పటికీ రమా రమి పదునైదు దినములై యుండవచ్చును. ప్రపంచమో. సంధకార బంధురమై కన్ను బొడుచుకొన్నను గానవచ్చుట లేదు. చెట్టులు పుట్టలు గట్టులు నేకముగ సంధకారావృత ములై నిర్దేశింప వలను పడక యుండెను.జగమెట్ల నిశ్శబ్దముగా నుండెను. జారులు చోరులు మొదలగువారు యధేచ్చా విహా రములు సలుపఁజొచ్చిరి.

జగన్మోహిని తండ్రి పేరు సోమ శేఖర మూర్తి. అతనికి ' బౌరుష మన్నను బౌరుషవంతులన్నను బ్రీతి విస్తారము. అతఁడు చిన్నప్పటి నుండియు విజయసింహు నెఁఱుగును. అతని సుగుణ గణము లతనికి సంతోష దాయకములు. జగన్మోహినీ విజయ సింహుల పరస్పర ప్రేమాను బంధమును, గూడ నతఁడు తెలిసికొనెను.

జగన్మోహిని యొక్క సౌందర్యము దిగంతము లెల్లనిండెను. సౌందర్యము కాని సుగుణములు కాని దాఁగునవి