ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొమ్మిదవ ప్రకరణము

77


యిప్పుడు నేఁ జెప్పఁదలఁచుకొన లేదు. చెప్పి ప్రయోజనము లేదు. కాని నాప్రార్థన మొకఁటియున్నది. విజయనగర సామ్రా జ్యము విశ్వవిఖ్యాతమైనది. అది యిపుడు తురుష్కుఁడును దుష్ట స్వభావుఁడునగు ఆదిల్ శాహా చేతిలోను, చక్రధరునిచేతిలోను బడ్డది. ఆ యిరువురి కుట్రలవలనను గొలఁదికాలమున నే విజయ నగర సామాజ్యమునకుఁ జిక్కులు తటస్థింప నున్నవి. అది యెఱిఁగి మాత్రము దానిని రక్షించుకొనుఁడు. తుచ్ఛమగు నాప్రాణము పోయిన నాకుఁ జింత లేదు. ఆ సామాజ్యము నిల్చిన నాకు జాలును.”

అతఁడు మఱి మాటలాడ లేదు. కొందఱు విశ్వసించిరి. మఱికొందఱు దూషించిరి. ఇంతలో నిరువురు వచ్చి యతని చేతులకు సంకెలలు వైచి గొంపోయిరి.