ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొమ్మిదవ ప్రకరణము

75



అని యతఁడు 'కారాగారాధిపతి కనుజ్ఞ నొసంగెను. కోపము క్రూర సర్పము. అది యెవరికడ నుండునో తుదకు వారినే నాశము చేయును. కోపాంధులకుఁ గన్ను లు కన్పడవు. మిన్ను తెలియదు, మన్ను తెలియదు. ఆత్మనాశముం గూడ వారు తెలిసికొనరు. తెలిసికొనుట కట్టివారికి వ్యవధి యుండదు. యుక్తాయుక్త వివేచనమున కది చోటీయదు.

అపుడు మెల్లగా, ఆదిల్శాహా లేచెను. ఆతని మొగము శాంతభావ ప్రస్ఫుటముగ నుండెను. మెల్లగ నిట్లు చెప్పెను. అత్యుత్తమ సామ్రాజ్య చక్రవర్తీ! జనకా ! సర్వవిజ్ఞాన విశేష శోభితులరగు మీకు నేను జెప్పుపాఁటి వాఁడనుగాను. కాని యొక చిన్న విజ్ఞాపనము చేసికొనుచున్నా డను. బుద్ధిసాగరులను నేను జాల కాలమునాఁటినుండియు నెఱుఁ గుదును. అతఁడు న్యాయైక పక్షపాతి. దేశభక్తడుసు. అతనికి రాజభక్తి యపారము. అతఁడిట్టి కార్యమును జేయ సమకట్టె ననుట మిక్కిలి వింతగాఁదోఁపక పోవదు. అతని శత్రువు లెవరేని యిట్లు కల్సియుండవచ్చును. లేక మఱియొకటి కావచ్చును. అది మనమూహింపఁ జాలము కావున నీయన గారియందు దయ యుంచి సమూలము విచారించి, మఱి శిక్షించిన బాగుండును, అట్లు సేయుటకు నేను మిమ్ములను మిక్కిలి విసయముతో బ్రార్ధించుచున్నాను.