ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవప్రకరణము

61

జగన్మో: అవును. అది చాలఁ బెద్దదై నది. దానికిపుడు రెండు పిలలు.

విజయ:-సంతోషముగా నున్నది. మాధవీ మంటపమళ్లీ నిల్చి యున్నదా?

జగన్మో: అవునట్లే యున్నది.

విజయ:-రసాలములు కాపునకు వచ్చినవని తలఁచెదను.

జగన్మో:-ఆఁ! నచ్చినవి

కాని యింతలో నాపె భావమున కేదియో తట్టెను.తోడనే యాపె కొంచెము నొచ్చుకొని యిట్ల నెను. ఇప్పుడు నేనును స్వర్ణ కుమారియుఁ గలిసి నచ్చుచుండఁగా నామె నాతో మీకు సమరమున దెబ్బలు తగిలినవని మాత్రము సూచించినది. అంతకంటె నప్పుడేమియుఁ జెప్పినది కాదు. అది పూర్తిగా సయమైన దా!” విజయసింహుఁ డౌజగన్మోహినికి సర్వమును వినిపించెను. నెన్నుపై మానుచున్న గాయము సతఁడు చూపించెను. ఆపె మఱి విన లేకపోయెను. కస లేకపోయెను. ఆమె హృదయ మున దడజనించెను. అభినన వికసి తేందీవర పత్రముల సధఃక రించుచున్న యాకనుంగవయందు నీరు గిఱునఁ దిరిగెను. అది ప్రవాహరూపమున హించెను. అది యాపెకు గోచరముకాలేదు. కాని యా బాష్పజాలము లామె కనులను గప్పి వేసెను. అంత నవి యచటనుండి మౌక్తికజాలములవలెఁ గ్రిందఁబడఁజొచ్చెను. దానిని మనవిజయ సింహుఁడు కనిపెట్టెటను. అతని హృదయము