ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

విజయనగర సామ్రాజ్యము


శక్తి నాయొడలున నా పాదమ స్తకము వ్యాపించి నన్ను గదల్చి వైచును. అపుడు నా కేమియుఁ దెలియదు.

జగన్మో: - స్వ దేశవేష భాషాభిమానాస్సంతో రసప్రలుధియః' అని మనము నన్నయభట్టీయమునఁ జదివియుండ లేదా ? స్వదేశాభి మానమెప్పుడు నుత్తమ మానవులకు స్వాభావిక మే. కాని విజయసింహా ! అన్నప్పుడెల్ల నట్లు స్వదేశాభి మాన ప్రేరితుఁడనై క్రిందుమీఁదులు తెలియక వర్తించితి వేని చెడుగులు పెక్కులు సంభవించును సుమి. కొన్ని యెడలఁ దానిని గొంచెము గోప్యము సేయవలసియుండును.

విజయ: అవును ! దీర్ఘదృష్టి గల నీనుడువు లెంతయు వర్ణనీయ ములు. అన్నప్పుడెల్ల నట్లుండుట గొన్ని యెడల హాని కాగలదు. ఇది యనుభవ పూర్వకముగఁ దెలిసికొని కొం చెము కొంచెమా స్వభావమును దగ్గించుకొనుచున్నాను. నీ విపుడు చేసిన యుప దేశము నెప్పటికి మజువఁజాలను.

జగన్మో: నీవు మిక్కిలి దయతోడఁ బెంచిన కురంగశాబకమును మఱచితివా?

స్త్రీలకు స్వాభావికముగఁ బురుషులకంటె విలాసములం దును, వేడుక లందును బ్రీతి హెచ్చు. అందుచేతనే వారు బొమ్మ లాట మొదలగు నాటలు విశేషించి యాడుచుందురు.

విజయ: అవును. దానిని నాప్రాణ పదముగాఁ బెంచితిని. అది యిపుడేమైనది ! పెద్దదయినదా ! దాని కేమయిన పిల్లలా ?