ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58

విజయనగర సామ్రాజ్యము


ప్పుడు రక్తవర్ణ సంశోభితములు నగుచుండెడివి. అదియం . తయు బాగుగా జ్ఞప్తియందున్నదా ! ఆంధ్ర యౌవనుఁడా ! మఱియు నప్పుడు “ సమయము దొరకిన నేను విజయనగర సామ్రాజ్య చక్రవర్తుల సేవచేసి యా విజయనగర చక్ర వర్తిని భరతఖండ సామ్రాజ్య పట్ట భద్రుని జేయుదును' అని ప్రగల్భములు బల్కుచుండువాఁడవు. మఱియు నట్టి యుద్దేశముల తోడనే శౌర్య ధైర్యనిలయుఁడపై విజయన గర సామ్రాజ్య సేవయంగుఁ జేరి యింతత్వరలో నింత యున్నత స్థితికి వచ్చితివి. అవి యన్నియునీకు జ్ప్తియందు గలవా?

ఆ వీణావతంసుని హృదయ మాహ్లాద పరిపూర్ణమాయెను.

విజయ :-అవును. జగన్మోహినీ ! నీయట్టి యుదారహృదయ రాండ్రిట్లు స్నేహితులకు వీరరసబోధనము గావించు చుండఁగా నాంధ్ర సామ్రాజ్యలమ్మ కేమి కొదువ ? ఆంధ్ర వనితారత్నమా! నీశౌర్య ధైర్యసముపేతమగు హృదయము సం స్తవనీయము. నీయట్టి ధీరు రాండ్రగు స్త్రీరత్నములే 'యాంధ్ర దేశమునకును భరతఖండమునకును గావలసియు న్నారు. ఇపుడు ముఖ్యముగా ఆంధ్ర దేశము నందును విజయనగర సామ్రాజ్యమునం దెల్లెడలను సుందరీ సుండ గుల చిత్తములు స్వదేశాభిమాన పరిపూర్ణ ములగుచున్నవి. అయినను, ఇంకను దగిన కాలము రాలేదు. కాని, దేశము