ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

విజయనగర సామ్రాజ్యము


వలె నుండిరి. అరనిముసము గడచినది. జగన్మోహిని మెల్లగా 'స్వర్ణ కుమారీ ! పోయితివా !' అనియెను. ప్రత్యుత్తరము రాలేదు. మఱి యీమె యాపెను బిలువ లేదు. ఆపై యటుం డవలెనని తలఁప లేదు.

విజయ :-జగన్మోహినీ! నీదర్శనము చిరకాలమునకు సంప్రా పమైనది. క్షేమ మేగదా ?

ఆమెయొడలు పులక రించెను. అది చిర కాలముండ లేదు. కాని యామె మొగము వ్రీడా విలాసముచే నలంకరింపఁ బడి నూత్న శోభచేఁ బ్రకాశించుచుండెను. సిగ్గు సుందరీ మణుల కొక యమూల్యాలంకరణము. యావనము విచిత్రమై నది. అది విలాస వతులను, విలాసవంతులను బరిపూర్ణముగా మార్చి వేయును. ఆ యిరువురు బాల్యమునుండి మిత్రులు. సర్వకాలములయందు నొకరి నొకరు విడువక కలసి మెలసి యుండిరి. వారికపుడు సిగ్గు లేదు. ఆ భావ మే వా రెఱుఁగరు. వారి హృదయములు నిర్మలములు. నిష్కళంకములు. అవి యిపు డును నీష్కల్మషములే కాని యిపుడు వారిస్థితి మారినది. నవ యౌవనము వారి నలంకరించినది. ఇపుడు వారిద్దఱకును మునుపటి చొరవ లేదు. అది హిందూసుందరీ సుందరులకు సహజము. ఆ యిరువురి మొగమున నించుక మందహాస మంకురించెను.

ఆపె యిట్లనెను. “అవును! బాల్య స్నేహమును మఱచి పోయితివి గాఁబోలు. విజయసింహా ! యింత కాలమైనను, ఒక