ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవ ప్రకరణము

అతని హృదయము ఝల్లుమనెను

అది, మంద మారుతముచే నోడలు మఱచి, తమ్మను కరింపుచు, తమ వెనుక గంతులు వైచుచు నుల్లాసవశమున దుముకుచున్న కిశోరములను సానురాగముగాఁ వెనుదిరిగి చూచుచు, దర్భాంకురములఁ గొఱకుచున్న హరిణుల పై దమ చూపులను ఓరవంపుగాఁ ద్రిప్పీ, హరిణములు చూచు చున్నట్టి సాయంసమయము. సంజ నిష్క్రమించెను. ప్రాచీ దిగ్భాగమున నిలిచి రజనీమనోహరుఁడు విలాస సంశోభితము లగు తన చూడ్కులను బ్రియాముఖమునఁ బఱపుచుండెను. రజనీముఖము పరిపూర్ణ ప్రభా భాసురమాయెను. జగన్మోహినీ స్వర్ణ కుమారులట్లు నడిచి తుదకొక సౌధ ప్రాంతముం జేరి యందుఁ బ్రవేశించిరి. స్వర్ణ కుమారి యాపె నా. సౌధమధ్య భాగమునకుఁ గొంపోయి విడిచి, తో డనే వెనుకకు గిట్టునఁదిరిగి నిష్క్రమించెను. అచట విజయ సింహుఁడుండెను.ఆ సుందరీసుందరుల మొగములులాస వంతములై ప్రకాశింపఁజొచ్చెను. వారిరువుర నోట నొక మాట యైన రాలేదు. నిశ్శబ్దముగ నుండెను. ఇరువురుం జిత్ర ప్రతిమల