ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏడవ ప్రకరణము

51


‘విజయసింహునిజూచి చిర కాలమైనది. ఇతఁడు నేనును స్వర్ణ కుమారియుఁ గలిసి చదువుకొనునప్పుడు నిత్యము నీ యుద్యానవనములఁ బూవులుకోసి మాలికలుగాఁ జుట్టుకొను చుండువారము. పూల చెట్లకొకరి నొక రుత్సాహమున మీరి నీరుపోయుచుండు వారము." అవి సంతోష దినములు.” దూరముననుండి యవ్య క్త స్వనములతో నందెలచప్పుడు వినవచ్చుచుండెను. కానియామె విన లేదు. సంధ్య ప్రాచీ ముఖమును రక్తిమతో నలంక రించెను. ఆ నిస్వనములు నమిపిం చెను. ఆమె స్వర్ణ కుమారి. ఆమె యిట్ల నెను. ' ఈసాయంసమ యమున నిచటికివచ్చితి వేమి ! నీవుందువని నేను సంగీతశాలకుఁ బోయివచ్చితిని."

'జగ :-ఏమియును లేదు. ఈసాయంసమయమున నీమాధవీలత క్రిందఁజల్ల గా నుండునని వచ్చితిని.

స్వర్ణ:-అగును. ఇది విజయసింహుఁడు--

ఆమె మొగమునఁ బరిహాసము ప్రస్ఫుట మగుచుండెను. అమె యంతకంటె నెక్కువ వచింప లేదు. జగన్మోహిని మో ము విరళమాయెను. ఆ పె యిట్లనెను.

“అగును. నీ మాట లెప్పుడు చమత్కార దాయకముగానుండలేదు"

స్వర్ణ :- నేను నీకు నత్యంత ప్రియమగు నొకవ స్తువుం జూపఁదలఁ చితిని. నీకిష్ట మేనా ?