ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

విజయనగర సామ్రాజ్యము


శించుచుండెను. ప్రపంచ మెల్ల నిశ్చలమై సాధుని హృదయము వలేఁ దోఁచుచుండెను. అప్పుడప్పుడు తెల్ల వారెనని లేచి కూయుచున్న పక్షుల రొదతక్క మఱేమియు ధ్వనివినవచ్చుట లేదు. విజయ సింహుఁడా యుటజమున నొకగదిలో నిద్రించు చుండెను. మందమారుత సేవకుఁ డతనికి సమీపముసఁగల మల్లికలయు, సకల విధ పరిమళ కుసుమములయు, సుగంధ మును హరించి తెచ్చి హాయిగా వీచుచుండెను. అతనికి గాయముల బాధ చాలవఱకు నశించినది. గాఢ నిద్రపట్టెను. అతఁడు కన్నులు తెఱచెను. మినుకు మినుకుమను దీపపు వెల్లురున నాతఁడొక సుందరీమణింగాంచెను. ఆమె వదనము నవ వికసిత సహస్ర పత్రమువలె నిసర్గమనోహరమై యుండెను. ఆమె కనులు దీర్ఘములు. వక్రములు. చారు వినీలోత్పల మాలి కల నీను చుండెను. ముఖమునఁ జిఱునగవు ప్రకాశించుచుండెను. ఆమెకుఁ బదునా జేండ్లుండును. ఆమె మోహిని. చూచువారి నట్టె యాకర్షించివైచును. కాని, యామె మొగమున నపు డనగత్యముగాఁ జిఱునగ వేల యంకురింపవలయునో ! బహుశ ఆ మొగ మెప్పుడు నట్లే నవ్వు చున్నట్లుండును. అతఁ డొకసారి యా చిత్ర ప్రతిమ వంక వీక్షించెను. 'మఱలఁజూచెను. కాని యా విగ్రహము గోచరము కాలేదు. ఆ విగ్రహము నతఁడిదివఱకు వీక్షించి యుండును, ఇదే మొ దటిసారి కాదు. అది యేమై యుండును ? నిజముగా నతఁడు