ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆఱవ ప్రకరణము

43

83

అతఁడు విజయసింహుని కర మవలంబించి చమిరెను. శిరము సవరించెను. “నాయనా ! అదియంతయుఁ దరువాతఁ జెప్పెదను: పరుండుము అనియెను.

విజయ :-ఇప్పుడు నేనున్న యీస్థలము పేరేమి ?

శ్రీధ :-ఇది మనగృహమే లే. నీవుబడలియున్నావు, కొంచెము సేపు విశ్రమింపుము.

అతఁ డీ మాటలను వినెను. కొని యతని కర్థము కాలేదు. అతఁడేదో దూలోచించు కొనియెను. అతఁ డాదుర్బల స్థితిలో జరిగిన యంశమును జ్ఞప్తికిఁ దెచ్చుకొనం జాలక పోయెను. అతఁడు మరలఁ దసచూడ్కులను యోగి మొగము పైఁ బ్రసరింపఁ జేసెను. అవి విశుభ్రకాంతులను వెదఁజల్లుచు సాత్విక భాన ప్రబోధకములై యుండెను. అతఁడట్లు స్థిమితముగాఁ గొంత సేపటివజుకుఁ జూచెను. కాని మాటలాడుటకుఁ గాని యోగి యాజ్ఞనుభంగము సేయుటకుగాని యతని కిష్టము లేదు. ఎట్ట కేలకు మరల నిద్రించెను.

ఇట్లు దినములు గడచినవి.క్రమక్రమముగా తని బాధ తగ్గిపోవుచుండెను. శుక్లపక్ష సుధాకరుని మాడ్కి సతని మొగము దినదినము నూతనమనోహర కాంతులచే శోభిల్లు చుండెను.

ఒకనాఁటి రాత్రి రమారమి రెండు జాములు ప్రొద్దు పోయెను. దిక్చక్రమెల్ల - బండు వెన్నెలచే నాక్రమింపఁబడి ప్రకా