ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఐదవ ప్రకరణము

39


మూర్తి, యచట.-ఆ దుర్గము0 తారమున నశించిపోవునా యేమి?

దూరముననుండి మఱల డెక్కల చప్పుడు వినఁబడు చుండెను. సాయుధులై నల్గురు జనులు నాల్గు గుఱ్ఱముల పై నెక్కి యా మహారణ్యమున మిక్కిలి వేగముగాఁ బరుగెత్తిం చుచు వచ్చుచుండిరి. వారిపుడు మిక్కిలి సమాపించిరి. కేక వేటుదూరమున నుండి యిట్లు వినఁబడెను. “ఓవిజయసింహా ! మేమును వచ్చుచున్నాము. భయపడకు, భయపడకు. శత్రువు లంజించి చెండాడుము'

విజయసింహుఁడు మజల నొకపరి విజృంభించెను. మండుచున్న కార్చిచ్చువలె శత్రువులను దహించుచుండెను. నాల్గుఖడ్గములువచ్చి నాల్గుతలల నొక్క పట్టున భూమి పై బడఁ గొట్టెను. మఱి నాల్గుతలలు 'నేల పై బడెను. జనము పల్చనా యెను. మిగిలిన తలలకు భయము హెచ్చాయెను. తోడనే పలాయ సమునకు దిగిరి. అర నిముసము గడచినది. ఎదుర్కొని పోర నొక మనుజుఁడుగూడ నేఁడు. సచ్చిన వారిలో నొకఁడు మనమెఱిఁగినవాఁడే. అతని మొగమువంకఁ బరీక్షించి చూడుఁడు. అతఁడు శ్రీధరుఁడు. పాపము విజయసింహునకు గాయములు చాలఁ దగిలినవి. అందొక పెద్ద గాయము భుజ ముల పైఁ దగిలెను. వేఱొకటి తొడల పై దగిలెను. మఱొకటి శిరమునఁ దగిలెను. అతఁడు డస్సిపోయెను. రక్త నాళముల