ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ పకరణము

చదరంగము ప్రారంభము



విజయనగర పట్టణమున నొక చోటి కిప్పుడు మన మరుగ వలసియున్నది. ఆ మహాసముద్రమున మనము మన గమ్య స్థానముం గనుగొనఁ గలమా ! మనకిపుడు రాజ బాటల నడువ వలసిన యగత్యము లేదు. వీధులజోక్యము మనము పుచ్చుకో గూడదు. మనకిపుడు గావలసినవి సందుగొందులు. ఇదిగో ! యీసందులోఁ జొజఁబడి నడువుడు. ఈసందునుండి యానం దు, ఆసందు నుండి యీ సందు, ఇట్లు పోవలయును. ఇవియన్ని యుఁ జిన్న సందులన్న మాటయేగాని పాఁడుపడ్డవిగావు. ఇది గో ! ఇప్పుడు మనమువచ్చిన చోటుచూడుఁడు! ఇచటఁ గొం చెము పాడువడినయిండ్లు గనఁబడుచున్నవి. ఇది పట్టణము వెలు పల. అదిగో! అచ్చట చిన్న కొండ యగుపడుచున్నది. చూచి తీరా ! అందు గుహ యొకటికలదు. మన మచటకిఁబోవల యును. మనమందుఁబ్రవేశించితి మేని యదిమనలనొరయుపవన మునకుఁ దీసికొనిపోవును. అందొక చిన్న బంగళా కలదు. చూడుఁడు ! ఆ బంగళాలో నొక తురుష్కుడొక కుర్చీ పై గూర్చుండి యున్నాఁడు.