ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వ్యవసాయ శాస్త్రము.


ఈ శాస్త్రీయ పద్ధతులమీద తెలుగులో వ్రాయఁబడిన యొక్కటియె. రెండు భాగములు సిద్ధమయినవి. రెండు భాగములలో - వందల రూపాయల విలువగల పుస్తకములలోని విషయములు సంగ్రహము, సులభ శైలిని వ్రాయబడినవి. సుబోధకముగ నుండుటకై యనేక పటము లను చేర్చియున్నాము. వ్యవసాయాభివృద్ధికిని, దేశము యొక్క భాగ్యవంతము నకును పాటుపడువారు వీనినిగొని లాభము పొందుదుడని నమ్ముచున్నాము. గ్రంథకర్త పిఠాపుర సంస్థానములో వ్యవసాయ శాఖాధ్యక్షులుగా నున్న గోటేటి జోగి రాజు పంతులు గారు. మొదటి భాగము వెల రూ. 1.4-0 రెండవ భాగము వెల రు. 1-8-0

అర్దశాస్త్రము

'.. దేశము యొక్క నిజ స్థితిని, రాజకీయ స్థితిని తెలిసికొనగోరు వారికీ శాస్త్రమే శరణ్యము. విఖ్యాత పండితవర్యులగు'క. రామలింగారెడ్డి, ఎం. ఏ. వ్రాయబడినది. మొదటి భాగము వెల 1_8_0


మహాపురుషుల జీవిత చరిత్రలు

ప్రపంచమున మనుజు లెక్కువగా పఠించవలసినవి మహాపురుషుల జీవిత చరిత్రములయినను మన భాషయందట్టివి మిగులతక్కువగా నున్నవి. జీవిత చరిత్ర పఠనముచే పొళ్చాత్య దేశములో గొప్పగొప్పవారు పుట్టినారు. దేశమునకు మహోపకారము చేసినారు. స్మయిల్సువంటి గ్రంథకర్తలకు సామగ్రి దొరకినది. ఈ మహోద్దేశముతో మేమా గ్రంథమును ప్రచురించియున్నాము ఇందు ఫ్లూటార్కు వర్ణిత చరిత్రలును, బెంజమిను ప్రాక్లిను చరిత్రయుగలవు. ఫ్లూటార్కు మహాకవికి పాశ్చాత్య దేశములలో చాల మన్నన గలదు. ఫ్రాంక్లిను యోగ్యత లోకవిదితము. కావున గ్రంథస్థవిషయ గౌరవమును హగూర్చి

గ్రంథకర్త ప. శ్రీనివాసరావు, బి.. ఏ.

విజ్ఞానచంద్రికామండలి, చింతాద్రి పేట-మద్రాసు.