ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ ప్రకరణము

17


అట్టి ఈ విజయనగర సౌభాగ్యమును గనులారఁజూడ వల యునని కాఁబోలు సుధాకరుఁడు తన కాంతులను దిరస్కరించు చున్న యాహర్మ్యములయు, రాజ సౌధములయు, శిఖరము ల పై వ్యాపించి తన్నగరవీధులలోఁ బరిక్రమించి, యాభవన ముల గవాక్ష మార్గములగుండ లోనఁ బ్రవేశించి, స్వర్గలోకము నుండి విలోక నోత్సాహియైనచ్చిన ద్రష్ట యోయన నొప్పి య ప్పట్టణమున సంచరించుచుండెను. ఇంత ప్రణయముతో నిట్లు చరిం చుచున్న యాశుభాంశుఁడా మహానగరము నంధ కారమున ముంచిపోవునా ! అట్టియెడ నాచంద్రునికి సమకాలికుఁడై మఱి యొక నూతన పురుషుఁడా నగరముంబ్రవేశించెను. అతని మొగము చంద్రునివలె గుండ్రముగా నుండెను. అతఁడా పట్టణ మునకు వెలుపలగానున్న యొక బాటదగ్గఱఁగల యొక సర స్తీరమున నిలుచుండియుండెను. బహుశః యతనికి సంకేతస్థలమై యుండవచ్చును. అతడా రజనీ మనోహరతను గాని యాచంద్రుని విలాసమునుగాని చూచుట లేదు. అతని కా చల్ల గాలిలో షికారు చేయవలయుననియు లేదు. అతని మొగముఁజూచిన నతఁ డతిదీర్ఘ మగు నాలోచనయందున్నట్లు మనకు స్ఫురించును. అతఁడిట్లనుకొనఁ దొడఁగెను.

“ ఆహా ! రాజకీయ వ్యవహారములు మిక్కిలి పాపకర ములు. ఛీ! ఛీ! ఇంతకంటెను బిచ్చమెత్తుకొని జీవించుట మేలుగా నుండును. అయ్యో ! రాజుల కొల్వులలోనుండు