ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ ప్రకరణము

తారా నాధుఁడు

ఆ కాలమునఁ బ్రపంచమునఁ గల విశ్వవిఖ్యాత మహా నగరములలోఁ బ్రథమ స్థానముఁగాంచి, హిందూ దేశ యశో వైభవ సంపత్సమార్జనమున నగ్రస్థానము వహించి, యత్య ద్భుత శిల్పకళా విశేషముచే నెసఁగు ప్రాసాద జాలముల మించి, ప్రకృతి సౌందర్య సౌభాగ్యమునకు సంపూర్ణని కేతనమై, సకలలోక కవి పండిత సంస్తుత్యమై, అనిర్వచనీయమై, అనన్య లబ్ధ విభవమై, ఖ్యాతినందిన విజయనగర పట్టణము నొకసారి చూతము వచ్చెదరా? మీకు హుషారు లేదా"? కొంచెము కాలము తప్ప మఱేమియు మనము వ్యయము సేయ నవసరము లేదు ! ఆకసమును ముద్దు పెట్టుకొనుచు 'విశుభ్రకాంత పుంజు ములచేఁ గల ధౌత శిఖరులోయను భ్రమఁబుట్టింపఁ జాలిన యాహర్మ్యములను, ఆ ప్రాసాదములను, ఆ 'యుత్తమ: భవన ములను, ఆ రాజమందిరములను, ఆ విద్యాశాలలను, ఆ నాటక శాలలను, జూడుఁడు ! ఇట్టి వెం దేని గలవా? అదిగో; దూర మునుండి “.పాడుచున్న యా సుందరుల మృదుమధుర కలవర ములను వినుఁడు ! ఆపాడుచున్న దెవరు ? " అప్సరసలా ? 'గం